ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగాలి
తలకొండపల్లి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సాఫీగా ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పడకల్, తలకొండపల్లి, వెల్జాల్ గ్రామాల్లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోళ్లలో ఏవైనా సమస్యలు తలెత్తితే అక్కడిక్కడే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రాంతంలో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించి పచ్చని పైర్లతో కళ కళలాడేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ గట్ల కేశవరెడ్డి, వైస్ చైర్మన్ రవి కుమార్, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు భగ్‌వాన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ప్రధాన కార్యదర్శి డిగ్రీ కృష్ణ, పీసీసీ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, గూడూర్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment