మహిళా సంఘాల అభివృద్ధి భేష్
మొయినాబాద్‌రూరల్: తెలంగాణలో పొదుపు సంఘాల ఆర్థికాభివృద్ధి ఎంతో బాగుందని ఒడిశా అధికారుల బృందం కితాబిచ్చింది. మండల పరిధిలోని ఎన్కెపల్లి గ్రామాన్ని గురువారం 22 మందితో కూడిన బృందం సభ్యులు సందర్శించారు. స్నేహ పొదుపు సంఘాల సభ్యులతో సమావేశమై ముచ్చటించారు. ప్రభుత్వం ద్వారా మహిళా సంఘాలు తీసుకున్న రుణాలతో స్వయం ఉపాధి పొందుతున్న వివిధ దుకాణాలను పరిశీలించి వారితో మాట్లాడారు. సభ్యులు ఎలా సమావేశం అవుతారు.. ఎప్పుడెప్పుడు సమావేశాలు నిర్వహిస్తారు.. ప్రభుత్వం ద్వారా ఒక్కో సంఘానికి ఎంత రుణం ఇస్తున్నారు.. అప్పులు ఎలా కడుతున్నారు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాల పనితీరు బాగుందని అభినందించారు. తమ రాష్ట్రంలో ఇలాంటి సంఘాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీజీఐఆర్డీ అపార్డ్ శిక్షణ అధికారి అనిల్‌కుమార్, ఎంపీడీవో సంధ్య, ఎంపీవో వెంకటేశ్వరరెడ్డి, ఏపీవో రవీందర్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి, సీసీ రమేష్, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
కితాబిచ్చిన ఒడిశా అధికారుల బృందం
Comments
Please login to add a commentAdd a comment