మైసిగండి ఆలయాభివృద్ధికి కృషి
కడ్తాల్: దక్షిణ తెలంగాణలోనే ప్రఖ్యాతిగాంచిన మైసిగండి మైసమ్మ ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. మండల పరిధిలోని మైసిగండి మైసమ్మ దేవాలయాన్ని గురువారం ఆయన స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు. వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ ఆలయంలో మైసమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా చూడాలని ఆలయ ట్రస్టీ శిరోలీ, పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ జ్యోతి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీచ్యానాయక్, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి
Comments
Please login to add a commentAdd a comment