చిన్నబోయిన వైకల్యం
మొయినాబాద్: వైకల్యం శరీరానికే కానీ మేదస్సుకు లేదని నిరూపించాడు ఓ దివ్యాంగుడు. ప్రైవేటు పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తూ జానపదాలు, కవితలు రాస్తూ, పాటలు పాడుతూ కవిగా, గాయకుడిగా ఎదిగి డాక్టరేట్ అందుకుని స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. దివ్యాంగుడైన ఆరింపుల జానయ్య పెద్దమంగళారం రెవెన్యూలోని మమత ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. ఇతని కళలను గుర్తించిన హైదరాబాద్ ఫ్రెండ్‌షిప్ మినిస్ట్రీస్ సంస్థ అతనికి జానపద కవి, గాయకుడిగా డాక్టరేట్ ప్రదానం చేసింది. నగరంలోని అల్‌లైడ్ ఆర్టిస్ట్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సాహితీవేత్తలు, మా అసోసియేషన్ చైర్మన్, ప్రభుత్వ అధికారుల చేతులమీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టరేట్ రావడంతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు.
దివ్యాంగుకుడికి డాక్టరేట్
Comments
Please login to add a commentAdd a comment