ఆమనగల్లు: విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యాలుగా ఐక్యత ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి అన్నారు. ఐక్యత ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొంది పలువురు యువతీ, యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఎంతో సంతోషానిస్తోందన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీలక్ష్మి గార్డెన్స్‌లో ఐదురోజులుగా నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. క్యాంపులో కంటి ఆపరేషన్లు నిర్వహించుకున్న వారితో ముచ్చటించారు. అంతకుముందు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ పరీక్షల కోచింగ్ క్యాంపులో శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పది మందిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం మరోసారి క్యాంపు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా శంకర నేత్రాలయ సహకారంతో ఉచిత కంటి శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు చంద్రశేఖర్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు శ్రీరాములు, శ్రీనివాస్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, శేఖర్, ఖాదర్, రాజశేఖర్, మైసయ్య, కొండల్‌రెడ్డి, అభినవ్‌రెడ్డి, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.
టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment