సమన్వయంతో పనిచేయండి
కడ్తాల్: అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని ఎంబీఏ గార్డెన్లో శనివారం కడ్తాల్, ఆమనగల్లు, మాడ్గుల్, తలకొండపల్లి మండలాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయా శాఖల పనితీరు, పురోగతి, చేపడుతున్న పనులను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. ఆయా శాఖలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని, సీఎం వద్దకు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, ఆర్డీఓ అనంతరెడ్డి, డీఆర్డీఓ పీడీ శ్రీలత, జిల్లా పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి, సింగిల్‌విండో చైర్మన్ గట్ల కేశవరెడ్డి, తహసీల్దార్ ముంతాజ్, మార్కెట్ చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment