మద్యం.. కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది.. అయినవారి మధ
ఆదర్శంగా నిలిచారు
షాద్‌నగర్: సరిగ్గా 14 ఏళ్ల క్రితం కేశంపేట మండలం బోదనంపల్లి గ్రామంలో పదుల సంఖ్యలో బెల్టు దుకాణాలు కొనసాగేవి. మద్యం మత్తులో తరచూ వాగ్వాదాలు చోటుచేసుకునేవి. కుటుంబాలకు పెను శాపంగా మారిన ఈ రక్కసిపై స్థానిక మహిళల పోరు షురూ అయింది. గ్రామంలో మద్యం సీసాలు, సారా బాటిళ్లను బయటికి తెచ్చి ధ్వంసం చేసి పోరాటాన్ని కొనసాగించారు. ఫలితంగా ఆ గ్రామంలో మద్య నిషేధం అమల్లోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఈ గ్రామంలో బెల్టు షాపులు కానీ, మద్యం తాగడం కానీ కనిపించడం లేదు. మద్యంప్రియులు బయట ప్రాంతాలకు వెళ్లి తాగాల్సిందే. ఇదీ ఇక్కడి నిబంధన. ఇదే స్ఫూర్తితో అల్వాల గ్రామస్తులు ముందడుగు వేశారు. మద్య నిషాధాన్ని అమల్లోకి తెచ్చారు. ఏడేళ్ల పాటు ఈ గ్రామంలో మద్యం నిషేధించినా ప్రస్తుతం అక్కడక్కడా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక విశ్వనాథ్‌పూర్ గ్రామంలో కూడా కొన్నేళ్లుగా మద్య నిషేధం కొనసాగుతోంది. ఈ గ్రామస్తుల పోరాటం మరిన్ని గ్రా మాలకు ప్రేరణగా నిలిచింది.
ఒకే ఒక్కడితో మొదలై..
ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్‌లో గ్రామానికి చెందిన నడుల్ల శేఖర్ అనే యువకుడితో పోరాటం మొదలైంది. గత సెప్టెంబర్‌లో మద్య నిషేధం చేయాలని గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరహార దీక్షకు దిగాడు. గ్రామ పెద్దలు, మహిళలు రాజకీయాలకు అతీతంగా అతడికి మద్దతు తెలిపారు. బెల్టు దుకాణాలు ఎత్తివేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే, ఎకై ్సజ్ అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. పంచాయితీ వారు బెల్టు దుకాణాలకు నోటీసులు జారీ చేశారు. ఇక నుంచి మద్యం విక్రయిస్తే చెప్పుల దండ వేసి ఊరేగిస్తామని.. మద్యం విక్రయించిన, కొనుగోలు చేసిన వారికి జరిమానా విధిస్తామని ప్రత్యేకంగా గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానా విధిస్తామని, అమ్మేవారిని పట్టిస్తే రూ.10 వేల నజరానా అందజేస్తామని ప్రకటించడంతో బెల్టు దుకాణాల్లో మద్యం విక్రయాలు నిలిచిపోయాయి. ఇక్కడి పోరాటం మరికొన్ని గ్రామాలకు పాకింది. ఇదే మండలంలోని గంట్లవెళ్లి, చౌడమ్మగుట్ట తండావాసులు సైతం మద్య నిషేధం అమలు చేయాలంటూ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment