మహాద్భుతం.. కన్హా శాంతివనం
నందిగామ: ‘ఓ వైపు ఆధ్యాత్మిక ధ్యాన మందిరం.. మరో వైపు ఆకుపచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇంకో వైపు ప్రకృతి సహజసిద్ధ వ్యవసాయం.. ఇలా కన్హా శాంతివనం మహాద్భుతంగా ఉంది’ అని గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ అన్నారు. నందిగామ మండలంలోని కన్హాను శనివారం ఆయన సందర్శించారు. శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు, హార్ట్‌ఫుల్ నెస్ సంస్థ గ్లోబల్ గైడ్ కమ్లేశ్ డి.పటేల్‌తో కలిసి ధ్యానం చేసి, అనంతరం శాంతివనాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ సహజసిద్ధంగా చేస్తున్న వ్యవసాయం బాగుందని కితాబిచ్చారు. అనంతరం మొక్కలు నాటారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
యాచారం: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సెర్ప్ డీపీఎం నర్సింహ అన్నారు. మండల పరిధిలోని నందివనపర్తి, యాచారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోలులో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యంలో తేమ శాతం అధికంగా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. డ్వాక్రా సంఘాల సమావేశాలు ప్రతీ నెల కచ్చితంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళల డబ్బులు దుర్వినియోగమైతే బాధ్యులైన సీసీలు, వీబీకేలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సెర్ప్ ఏపీఎం సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
పెండింగ్ కేసుల్లో
పురోగతి ఉండాలి
చేవెళ్ల: పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల్లో వేగవంతమైన పురోగతి ఉండాలని డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ ఆదేశించారు. మండల కేంద్రంలోని ఏసీపీ కార్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఏసీపీ పరిధిలోని పోలీస్ అధికారులతో సమావేశమై పోలీస్‌స్టేషన్ల వారీగా కేసులపై సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేవెళ్ల ఏసీపీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యాలయం పరిసరాలు పచ్చదనంతో పరిశుభ్రంగా ఉన్నాయని అభినందించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ బి.కిషన్, ఇన్‌స్పెక్టర్లు భూపాల్ శ్రీధర్, పవన్‌కుమార్‌రెడ్డి, కాంతారెడ్డి, డీఐ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌నాయుడు ఉన్నారు.
మహారాష్ట్రలో గెలుపుపై బీజేపీ సంబరాలు
చేవెళ్ల: దేశం మొత్తం బీజేపీ వైపు చూస్తోందని.. తెలంగాణలోనూ వచ్చే ఎన్నికల్లో తమదే గెలు పని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహా రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శనివారం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎ.అనంత్‌రెడ్డి, యువ నాయకుడు డాక్టర్ వైభవ్‌రెడ్డి ఆధ్వర్యంలో మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపుపై సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొక్క నర్సింహారెడ్డి మాట్లా డుతూ.. దేశ ప్రజలంతా మొత్తం బీజేపీ, ప్రధాని మోదీవైపే ఉన్నారని మరోసారి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు నిరూపించాయని అన్నారు. దేశంలో మోదీ పాలన అవినీతి, అక్రమాలకు చోటు లేకుండా సాగుతోందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. ఇలాంటి ప్రభుత్వమే తమ రాష్ట్రంలోనూ ఉండాలని బీజేపీని ఆదరించి మహారాష్ట్ర ప్రజలు గెలిపించుకున్నా రని పేర్కొన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే నమ్మి మోసపోయిన ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ రాష్ట్ర నాయకుడు కంజర్ల ప్రకాశ్, సీనియర్ నాయకులు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కుంచం శ్రీనివాస్, కృష్ణాగౌడ్, శర్వలింగం, ప్రతాప్‌రెడ్డి, రాములు, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment