ఆలయాభివృద్ధికి కృషి
కొందుర్గు: దేవాలయం అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని మహబూబ్నగగర్ ఎంపీ డీకే అరుణ హమీ ఇచ్చారు. శనివారం కార్తీక మాసం సందర్భంగా మండల పరిధిలోని సంజీవపురం చింతల్ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డీకేఈ అరుణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ భక్తి బావనతో మెలగాలని, ఆద్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్దన్ రెడ్డి, నాయకులు అందె బాబయ్య, భూపాలచారి, శివారెడ్డి, ప్రభులింగం, లక్ష్మీకాంత్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సుధాకర్ రావు, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ
Comments
Please login to add a commentAdd a comment