హయత్‌నగర్: ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ వ్యక్తి క్షేమంగా తిరిగి వచ్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధి తొర్రూర్ బాలాజీనగర్‌లో నివసించే బత్తుల మహేశ్(30) ప్రైవేటు ఉద్యోగి. శనివారం కుటుంబీకులు మందలించడంతో ఆత్మహత్య చేసుకోవాలని ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్దకు బైకుపై వెళ్లాడు. బైకు, హెల్మెట్, బ్యాగు, పర్సును కట్టపై ఉంచాడు. చెరువులోకి దూకేందుకు యత్నించగా.. నీటిని చూసి భయపడ్డాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్లకుండా ఫోన్ స్విచ్చాఫ్ చేసి, బెంగళూరు బస్సెక్కి వెళ్లిపోయాడు. బయటకు వెళ్లిన యువకుడు ఇంటికి రాకపోవడంతోఆందోళనకు గురైన కుటుంబీకులు ఆదివారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహేశ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్నం చెరువు కట్టపై ఆయనకు చెందిన బైకు, ఇతర వస్తువులను గుర్తించిన పోలీసులు.. మహేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత భావించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది చెరువులో గాలించారు. ఈ క్రమంలో యువకుడి ఫోన్ ఆన్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. యువుకుడి ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్ పెట్టారు. తిరిగి ఆ వ్యక్తి పోలీసులకు మెసేజ్ చేయడంతో.. వ్యక్తి రాయచూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల చొరవతో సోమవారం మహేశ్ హయత్‌నగర్ ఠాణాకు వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబీకులకు అప్పగించారు.
నగర వైద్యుడికి ప్రతిష్ఠాత్మక అవార్డు!
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ప్రముఖ దంతవైద్యుడు డాక్టర్ వికాస్ గౌడ్‌కు ‘ఫ్యామ్‌డెంట్ అవుట్ స్టాండింగ్ డెంటిస్ట్ ఆఫ్ ద ఇయర్’అవార్డు లభించింది. దంత వైద్యరంగంలో అత్యుత్తమ ప్రతిభతోపాటు రీసెర్చ్, బోధన, రోగులకు అందించే సేవల వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే ఈ అవార్డుకు ‘దంత వైద్య ఆస్కార్‘అనే పేరు కూడా ఉంది. ఈ నెల 18న ముంబైలో ఫ్యామ్‌డెంట్ ఫౌండర్ డాక్టర్ అరోరాతోపాటు ప్రఖ్యాత దంతవైద్య నిపుణులు డాక్టర్ సబితా రామ్, కుమారస్వామి ఆయనకు అవార్డును అందజేశారు. డాక్టర్ వికాస్ గౌడ్ ఇంప్లాంటాలజిస్ట్ ఆఫ్ ద ఇయర్, ఈస్థెటిక్ డెంటల్ ప్రాక్టీషనర్ ఆఫ్ ద ఇయర్ అనే మరో రెండు విభాగాలకు కూడా ఎంపికయ్యారు. ఆయన పాతికేళ్లుగా దంతవైద్యంలో ఉత్తమ సేవలందిస్తున్నారు. ‘ఈ అవార్డు దక్కడం నా వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, నా టీమ్, గురువులు, రోజూ స్ఫూర్తినిచ్చే నా దంత రోగులందరి తరఫున నాకు లభించినట్లు భావిస్తున్నాను‘అని డాక్టర్ గౌడ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment