ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం

Published Tue, Jan 21 2025 7:22 AM | Last Updated on Tue, Jan 21 2025 7:22 AM

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం

ప్రజాసమస్యలపై నిరంతర పోరాటం

సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు రామస్వామి

చేవెళ్ల: ప్రజలకు వంద వసంతాల సందర్భంగా సీపీఐ పార్టీ గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆ పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కె.రామస్వామి అన్నారు. మండల కేంద్రంలో సోమవారం మండల కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పార్టీ వంద వసంతాల సందర్భంగా నియోజకవర్గస్థాయి జనరల్‌బాడీ సమావేశం ఈ నెల 28వ తేదీన చేవెళ్లలోని కేజీఆర్‌ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాన్ని నియోజకవర్గంలోని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కుణంనేని సాంబశివరావు హాజరుకానున్నట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే పార్టీ సీపీఐ అన్నారు. పెద్ద ఎత్తున ప్రజాసంఘాలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ సమావేశానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి సత్తిరెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement