సాక్షి స్పెల్‌బీ, మ్యాథ్‌బీతో మేధోశక్తి
కడ్తాల్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ‘సాక్షి’ మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని ప్రగతి పాఠశాల కరస్పాండెంట్ సువర్ణగోవర్ధన్‌రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ జైసన్ అన్నారు. సాక్షి ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్‌బీ పరీక్షలతో విద్యార్థుల్లో మేధోశక్తి పెంపొందుతుందని పేర్కొన్నారు. సాక్షి మీడియా ఆధ్వర్యంలో గతేడాది నవంబర్‌లో నిర్వహించిన సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ సెమీ పైనల్ పరీక్షల్లో.. పాఠశాలకు చెందిన కావ్య స్పెల్‌బీలో, రావుల అనన్య మ్యాథ్స్‌బీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి, ఈ నెల 22న బంజారాహిల్స్‌లోని రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు సోమవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించి, సన్మానించింది. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఇలాంటి పోటీ పరీక్షలను నిర్వహించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరగడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు దోహదపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment