ఆలయ భూములను ఆక్రమిస్తే సహించం
ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళికృష్ణ
ఇబ్రహీంపట్నం: దేవాలయాల భూములను అన్యాక్రాంతం చేయాలని చూస్తే సహించేదిలేదని ఇబ్రహీంపట్నం మండల ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మురళీకృష్ణ హెచ్చరించారు. పట్నం చెరువు కట్ట కింద ఉన్న శ్రీ వీరభద్రేశ్వర ఆలయానికి సంబంధించిన 2 ఎకరాల 22 గుంటల భూమిని పరిరక్షించేందుకు సూచిక బోర్డులను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతమంది ఆలయ భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. మండల పరిధి 16 దేవాలయాలు ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. దేవుడి మాన్యం అన్యాక్రాంతం కాకుండా సర్వే చేయించి ఫెన్సింగ్ వేయిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ యోగ్యంగా ఉన్న భూములను వేలం పాట ద్వారా కౌలుకు ఇస్తామని, తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అభివృద్ధికి వెచ్చిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం సెంట్రల్ కమిటీ రాష్ట్ర సభ్యుడు శెట్టి శివకుమార్, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆనందప్ప, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుమారప్ప, బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు మహేందర్, అనిల్, సంతోష్, ఫణికుమార్, అలయ పూజరి పవన్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment