![వివరాలు వెల్లడిస్తున్న సీఐ వీణారెడ్డి - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/23/22nrk05-350066_mr_0.jpg.webp?itok=1SLoIO-c)
వివరాలు వెల్లడిస్తున్న సీఐ వీణారెడ్డి
నారాయణఖేడ్: టిఫిన్ సెంటర్‌పై ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి 600 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ వీణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండలం ర్యాలమడుగు తండా శివారులోని నిజాంపేట–ఖేడ్–బీదర్ జాతీయ రహదారి పక్కన భవానీ టిఫిన్ సెంటర్ లో గంజాయిని విక్రయిస్తున్నారని రహస్యంగా అందిన సమాచారం అందింది. ఎన్‌ఫోర్స్‌మెంటు ఎస్సై అనీల్, సిబ్బందితో కలిసి గురువారం రాత్రి దాడి నిర్వహించారు. దాడిలో 600 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.16 వేల వరకు ఉంటుంది. గంజాయిని స్వాధీనం చేసుకొని టిఫిన్ సెంటర్‌లో గంజాయి విక్రయిస్తున్న ఎండీ మహ్మద్‌ను అరెస్టు చేయగా టిఫిన్ సెంటర్ యజమాని అయిన ప్రధాన నిందితుడు జతీలాల్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నామని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment