పంచాయతీ ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఓటర్లు

Published Mon, Feb 10 2025 7:21 AM | Last Updated on Mon, Feb 10 2025 7:21 AM

పంచాయతీ ఓటర్లు

పంచాయతీ ఓటర్లు

7,84,489

సంగారెడ్డి జోన్‌: జిల్లాలో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. తుది జాబితా ప్రకారం జిల్లాలో 7,84,489 పంచాయతీ ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా అధికారులు గత సంవత్సరం సెప్టెంబరులో విడుదల చేసిన ఓటర్ల జాబితాకు 1 జనవరి 2025 వరకు దరఖాస్తు చేసుకున్న వారిని కలుపుతూ తుది జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఓటరు జాబితాను గ్రామ పంచాయతీ వార్డుల వారీగా మ్యాపింగ్‌ చేయాలని నిర్ణయించారు. దీంతో ఇటీవల అధికారులు ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేస్తూ, కొత్త వారిని జత చేసి తుది జాబితాను రూపొందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో అధికారులు ఫిబ్రవరి 3 ముసాయిదా జాబితాను విడుదల చేసి, 4వ తేదిన మండల స్థాయిలో రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలనలు చేసి తుది జాబితాను సిద్ధం చేశారు.

తగ్గిన పంచాయతీలు, వార్డులు, ఓటర్లు

జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాలతో కలిపి 27 మండలాలున్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మున్సిపాలిటీలలో విలీనం అయిన పంచాయతీలు, విలీనం కాగా గతేడాది సెప్టెంబరు నాటికి 646 గ్రామ పంచాయతీలు, 5,718 వార్డులు ఉండగా, ఇటీవల మరో నాలుగు నూతన మున్సిపాలిటీలు ఏర్పడటంతో గ్రామ పంచాయతీల సంఖ్య 633, వార్డులు 5,558కు తగ్గింది. అదేవిధంగా గతంలో 8,34,360మంది ఓటర్లు ఉండగా ప్రస్తుతం 7,84,489కి చేరింది.

జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు

నియోజకవర్గం జీపీ సీ్త్రలు పురుషులు ఇతరులు మొత్తం

అందోల్‌ 143 84,948 82,015 6 1,66,966

నారాయణఖేడ్‌ 196 95,075 95,964 6 1,91,045

నర్సాపూర్‌ 38 21,919 20,797 2 42,718

పటాన్‌చెరు 31 29,817 28,763 4 58,584

సంగారెడ్డి 87 68,688 65,908 27 1,34,623

జహీరాబాద్‌ 138 95,491 95,057 2 1,90,550

మొత్తం 633 3,95,938 3,88,504 47 7,84,489

తుది ఓటరు జాబితా విడుదల

గతం కంటే తగ్గిన ఓటర్ల సంఖ్య

తగ్గిన పంచాయతీలు, వార్డులు

మున్సిపాలిటీల్లో విలీనంతోనే...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement