![రూ.2.50లక్షలు పలికిన ఎడ్ల జత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09zhr42-350065_mr-1739152209-0.jpg.webp?itok=A042FTRG)
రూ.2.50లక్షలు పలికిన ఎడ్ల జత
పశువుల సంతలో ఎడ్లను దక్కించుకున్న ఓ రైతు
న్యాల్‌కల్(జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ గ్రామ సమీపంలో కొనసాగుతున్న ఆదివారం ఉర్సె షరీఫ్ పీర్‌గైబ్ సాహెబ్ దర్గా జాతర ఉత్సవాల్లో జరిగిన పశువుల సంతలో ఎడ్ల జత రూ.2.50 లక్షలు పలికింది. ఏటిగడ్డ ఎల్గోయి గ్రామానికి చెందిన వెంకట్‌రావు జత ఎడ్లను రూ.3లక్షలు చెప్పగా, రూ.2.50లక్షలకు రాయికోడ్ మండలంలోని నాగ్వార్ గ్రామానికి చెందిన సమీర్ కొనుగోలు చేశారు. అదేవిధంగా బొడ్మట్‌పల్లికి చెందిన నాగభూషణం జత ఎడ్ల ధర రూ.3.60లక్షలు చెప్పగా మునిపల్లి మండలం పెద్దలోడి గ్రామానికి చెందిన ఓ రైతు రూ.2.50లక్షలకు కొనుగోలు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. గతేడాది జత ఎడ్ల ధర రూ.2.35 లక్షలు పలకగా ఈ ఏడాది రూ.2.50లక్షలు పలికింది.
Comments
Please login to add a commentAdd a comment