![పోలింగ్ విధుల పట్ల అవగాహన ఉండాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09zhr74-350063_mr-1739152208-0.jpg.webp?itok=GmI87iba)
పోలింగ్ విధుల పట్ల అవగాహన ఉండాలి
డీఆర్‌వో పద్మజ రాణి
సంగారెడ్డి జోన్: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27న జరుగనున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎలక్టోరల్ నోడల్ అధికారి, డీఆర్‌వో పద్మజ రాణి ఎన్నికల సిబ్బందికి సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాల మేరకు ఎన్నికల నియమావళిని అనుసరించి, జిల్లా పరిధిలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీవోలకు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం మొదటి విడత శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా పీవోలు, ఏపీవోలను ఉద్దేశించి డీఆర్‌వో మాట్లాడుతూ...అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ భిన్నంగా ఉంటుందన్నారు. ఈ నెల 27న ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని, గడువు లోపు పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూ లైన్‌లో ఉన్న వారికి వరుస క్రమంలో టోకెన్ నంబర్లు అందించి వారితో ఓటింగ్ జరిపించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను పీవోలు తమ పర్యవేక్షణలోనే ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ మేనేజ్‌మెంట్ నోడల్ అధికారి ఈడీ, ఎస్ సి కార్పొరేషన్ రామాచారి, బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారి బాలరాజు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఆయా మండలాల సంబంధిత అధికారులు, పీ.వోలు, ఏ.పీ.వోలు, ఓ.పీ.వోలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment