సర్కారు బడుల్లో ప్రీప్రైమరీని ప్రారంభించిన పక్షంలో పేద విద్యార్థులకు ఎంతో ప్రయో జనం చేకూరనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు బడుల్లోనే ఎల్‌కేజీ, యూకేజీ విద్యను అందించేందుకు అంగన్‌వాడీలను సమన్వయం చేసుకుంటూ సాగడంతో పేద విద్యార్థులు ప్రాథమిక స్థాయి వరకు తమ పిల్లలను సర్కారు బడులకు పంపే అవకాశం ఉంది. బడులకు వెళ్లే వయస్సు రాష్ట్రంలో మూడేళ్లకే ప్రారంభమవుతుండగా సర్కారు బడుల్లో ఎల్‌కేజీ, యూకేజీ లేకపోవడం, 5ఏళ్ల వయస్సుతో 1వ తరగతిలో చేర్చుకుంటుండటంతో విద్యార్థులను తల్లిదండ్రులు ప్రైవేట్ బడులకు పంపిస్తున్నారు. పుట్టిన పిల్లలు 0–5ఏళ్లలోపు వారికి అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం అందజేస్తూ, ఆటపాటలతో విద్యాబోధన చేస్తారు. వీరిని సర్కారు బడులతో మమేకం చేయడం ద్వారా వీరికి పౌష్టికాహారంతోపాటు ప్రాథమిక విద్య అందేందుకు అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment