మరింత బలోపేతం
జిల్లాలో మండలాల వారీగా
విడుదలైన వడ్డీ నిధులు
మండలం గ్రూపులు విడుదలైన వడ్డీ (రూ.ల్లో)
అమీన్‌పూర్ 9 40,426
అందోల్ 82 3,13,528
గుమ్మడిదల 59 2,41,319
హత్నూర 207 9,43,410
ఝరాసంగం 355 13,25,283
జిన్నారం 50 2,04,383
కల్హెర్ 66 2,21,342
కంది 91 3,87,588
కంగ్టి 80 3,10,404
కోహిర్ 395 13,13,785
కొండాపూర్ 126 4,88,379
మనూర్ 53 1,95,918
మొగుడంపల్లి 223 6,21,718
మునిపల్లి 124 5,08,515
నాగిల్‌గిద్ద 55 1,70,622
నారాయణఖేడ్ 155 51,395
న్యాల్‌కల్ 443 13,82,264
పటాన్‌చెరు 152 7,36,685
పుల్కల్ 85 3,25,896
రాయికోడ్ 155 6,62,317
సదాశివపేట 112 5,28,597
సంగారెడ్డి 63 2,38,236
సిర్గాపూర్ 57 2,21,591
వట్‌పల్లి 72 4,01,756
జహీరాబాద్ 425 12,53,691
సంగారెడ్డి జోన్: జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు వివిధ రకాల రుణాలకు సంబంధించిన వడ్డీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లోని సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు జిల్లా గ్రామీణ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సభ్యులకు బ్యాంకుల ద్వారా వివిధ రకాల రుణాలను మంజూరు చేస్తుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించిన మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తూ ఆ నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తుంది. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇందిరి మహిళా శక్తి రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుంది.
జిల్లాలో 18,198 స్వయం సహాయక సంఘాలు
జిల్లాలోని వివిధ గ్రామాల్లో 18,198 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాలలో 1,90,381 మంది సభ్యులు ఉన్నారు. సంఘాలలోని సభ్యులకు వివిధ పథకాలు రుణాలు బ్యాంకుల ద్వారా మంజూరు చేసి ఆదాయం వచ్చే ఆస్తులను కొనుగోలు చేసి, ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తారు. బ్యాంకు లింకేజి, సీ్త్రనిధితో పాటు వివిధ రకాల రుణాలను అందిస్తారు. సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విధంగా చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం తిరిగి వడ్డిని నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంది. గత ప్రభుత్వ హా యంలో 3 సంవత్సరాలుగా విడుదల చేయాల్సిన వడ్డీ నిలిపివేసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు వడ్డీ కోసం ఎదురుచూసిన పరిస్థితులున్నాయి. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ బకాయిలను వెంటవెంటనే విడుదల చేస్తుంది.
రూ.కోటి 35లక్షల వడ్డీ విడుదల
గత ఆర్థిక సంవత్సరంలోని డిసెంబరు నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వడ్డీ బకాయిలను విడుదల చేసింది. గత కొన్ని నెలల క్రితం డిసెంబరు, జనవరి నెలలకు సంబంధించిన వడ్డి బకాయిలు విడుదల చేసింది. తాజాగా ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన 1,35,51,598 రూపాయలు మంజూరు చేసింది. నాలుగు నెలలకు సంబంధించి 17,014 గ్రూపులకు రూ.1,345.36లక్షలను విడు దల చేసింది. విడుదల అయిన వడ్డీ నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అవుతుంది. దీంతో మహి ళా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వయం ఉపాధితోపాటు ఇతరులకు ఉపాధి
మహిళా సంఘాలలో సభ్యులు తీసుకున్న రుణాలతో ఇతరులపై ఆధారపడకుండా తాను ఆర్థికంగా ఎదగటంతోపాటు మరికొంత మందికి ఉపాధిని సైతం చూపిస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల వివిధ రకాల రుణాలను తీసుకుని క్యాంటిన్, పెరటికోళ్లపెంపకం, గేదెల షెడ్డు (పాల ఉత్పత్తి)తో ఇతరులకు ఉపాధి చూపించే రంగాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. సభ్యులకు రుణాలను అందించటమే కాకుండా వారు ఆదాయం వచ్చే యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అవగాహన కల్పిస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
మహిళా సంఘాలకు రూ.కోటి 35లక్షల వడ్డీ విడుదల
డిసెంబరు నుంచి మార్చి వరకు అందించినప్రభుత్వం
నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ
సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి
మహిళా సంఘాల సభ్యులు సంఘం ద్వారా తీసుకున్న రుణాలు ఆదాయం వచ్చే మార్గాన్ని ఎంచుకుని రుణాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వం విడుదల చేసిన వడ్డీ నిధులు నేరుగా సభ్యుల ఖాతాల్లో జమ అవుతాయి. తీసుకున్న రుణాలు వాయిదాల ప్రకారం చెల్లించి, తిరిగి రుణం పొందవచ్చు. ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అందించటం జరుగుతుంది. –జ్యోతి, డీఆర్‌డీఓ, సంగారెడ్డి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment