కారు ఢీకొని యువకుడి మృతి
నర్సాపూర్ రూరల్: ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తూ అదుపుతప్పి పడిపోయిన ఓ యువకుడిని కారు ఢీ కొట్టడ ంతో అక్కడికక్కడే దు ర్మరణంపాలయ్యాడు. నర్సాపూర్–హైదరాబాద్ జాతీయరహదారిలోని కొండాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నా యి. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన అల్లం విక్రంరెడ్డి కుమారుడు కౌశిక్ కళ్యాణ్‌రెడ్డి(19), అతడి స్నేహితుడు రుషిల్ ఇద్దరూ కలసి చెరో రెండు బైక్‌లపై రైడింగ్‌కు వెళ్లారు. ఇద్దరూ సంగారెడ్డి జిల్లా జోగిపేటకు వెళ్లి తిరిగి నర్సాపూర్ మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా కొండాపూర్ అటవీ ప్రాంతంలోని మూల మలు పు వద్ద అదుపు తప్పి కల్యాణ్‌రెడ్డి కిందపడిపోయాడు. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వస్తున్న కారు కల్యాణ్రెడ్డిని ఢీ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని పంచనామా నిమిత్తం మృతదేహా న్ని నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చెరువులో పడి
యువకుడి మృతి
అల్లాదుర్గం(మెదక్): ప్రమాదవశాత్తూ చెరువులో పడి యువకుడు మృతి చెందిన ఘటన అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్లాపూర్ తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన పెద్దలంక జగపతిబాబు(27) కొద్ది రోజుల క్రితం తాపీ పనులకోసం ముస్లాపూర్ గ్రామానికి వచ్చాడు. అయితే శనివారం ముస్లాపూర్ గ్రామం నుంచి బయటకు వెళ్లిన జగపతిబాబు తిరిగి రాలేదు. ఆదివారం ముస్లాపూర్ తండా శివారులోని చెరువులో శవమై కనిపించారు. అయితే మృతుడికి మూర్ఛరోగం ఉండటంతో నీటిలో పడి చనిపోయి ఉంటారని తోటి కూలీలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వలస కూలీలను తీసుకొచ్చిన హరిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment