చట్టాలపై అవగాహన ఉండాలి
జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి
సంగారెడ్డి జోన్: బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి సూచించారు. మండల కేంద్రమైన ఝరాసంగం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బాలికల సంరక్షణ చర్యలు, చట్టాలపై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బాల్య వివాహాలు చేస్తే చర్యలు తీసుకుంటామ న్నారు. బాలికల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో ‘బేటీ బచావో– బేటీ పడావో’కార్యక్రమాలను నిర్వ హిస్తున్నట్లు వెల్లడించారు. బాలికలను ఎవ రైనా వేధించినా, ఇబ్బందులకు గురిచేసినా 181, 1098 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.
చేప పిల్లల పెంపకంతో జీవనోపాధి
ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
హత్నూర(సంగారెడ్డి): చేప పిల్లలతో మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన హత్నూర పెద్ద చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన చేపలు వదిలే కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...చేప పిల్లలతో కొన్ని నెలల తర్వాత మత్స్యకారులకు జీవనోపాధి దొరికి ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశాలు ఉంటాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు.
నల్లవాగులో మట్టి తొలగింపు
కల్హేర్(నారాయణఖేడ్): జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగు కాల్వలో పేరుకుపోయిన మట్టి తొలగింపు పనులు చేపట్టారు. గురువారం మండలంలోని ఖానాపూర్(కె), బీబీపేట శివారులో నల్లవాగు కుడి కాల్వలో మట్టి, పిచ్చి మొక్కలు తొలగించారు. ప్రాజెక్టు ఎఈ అలేఖ్యరెడ్డి పనులను పరిశీలించారు. యాసంగి సాగుకు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు ముందస్తుగా పనులు చేపట్టినట్లు తెలిపారు. త్వరలో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి
దారుణ హత్య
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణ సీఐ శివలింగ్ కథనం ప్రకారం పట్టణ సమీపంలో గల ఈద్గా మైదానం ప్రాంతంలో రైల్వే పట్టాల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని కనుగొన్నామన్నారు. అతన్ని కిరాతకంగా హత్య చేశారని చెప్పారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఎవరైనా గుర్తిస్తే జహీరాబాద్ పోలీసు స్టేషన్‌లో లేదా 8712656763, 8712656731 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
పద్మనాభస్వామి ఆలయ ట్రస్ట్ బృందం ఏర్పాటు
సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలం ఛేక్రియల్ గ్రామంలోని పురాతనమైన శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డు సభ్యుల బృందం ఏర్పాటైంది. ఈ మేరకు దేవాదాయ శాఖ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశా రు. ఆలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా భానూరి లక్ష్మయ్య, మన్నె నర్సింహులు, జంగిలి మల్ల మ్మ, తిమ్మారెడ్డిగారి అంజిరెడ్డి, రోళ్లపాటి సత్య నారాయణలతోపాటుగా ఆలయ ట్రస్ట్ బోర్డు ఎక్స్ అఫిషీయో సభ్యుడిగా ప్రధానార్చకుడు రామకృష్ణ శర్మలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పదవులకు శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బోర్డు నూతన అధ్యక్షుడిగా భానురి లక్ష్మయ్య ప్రమాణ స్వీకారం చేయాలని మంత్రి దామోద ర రాజనర్సింహ సూచించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment