పరిపాలనలో పరుగులు పెట్టిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. సివిల్స్‌లో 65వ ర్యాంకు సాధించి, 2016 బ్యాచ్ తెలంగాణ క్యాడర్‌కు ఎంపికయ్యారు. నిర్మల్‌లో ట్రైనీ కలెక్టర్‌గా, మహబూబ్‌నగర్ జిల్లా ప్రత్యేక అధికారిగా, కరీంనగ ర్ మున్సిపల్ కమిషనర్‌గా, జోగుళాంబ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. పట్టాపాస్ పుస్తకాలు రాకుండా ఇబ్బందులు పడుతున్న నిరుపేద రైతులపై దృష్టిపెట్టి వారి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాల్ని చేపడుతున్నారు.
తొలి ర్యాంకు సాధించి...
ఆర్.డీ మాధురి 2016లో జరిగిన గ్రూప్ వన్‌లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి, ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లాలో డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్‌గా, జగిత్యాల ఆర్డీవోగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా కొనసాగుతున్నారు.
సీడీపీవోగా ఉద్యోగ ప్రస్థానం...
లలిత కుమారి 2008లో నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో సీడీపీవోగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించా రు. వివిధ జిల్లాల్లో విధులు నిర్వహించి పదోన్నతిపై జిల్లా సంక్షేమాధికారిగా కొనసాగుతున్నారు.
ఎంపీడీవోగా ప్రారంభించి...
డీఆర్డీఏ పీడీగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి 1996లో మహబూబ్‌నగర్ జిల్లాలోని మాడ్గుల్‌లో ఎంపీడీవోగా తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. వివిధ స్థాయిలలో విధులు నిర్వహించి, పదోన్నతిపై ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా కొనసాగుతున్నారు.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా చేరి...
జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా ఉన్న వసంతకుమారి 1994లో రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల డివిజన్‌లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌గా విధుల్లో చేరారు. పదోన్నతులు పొంది ప్రస్తుతం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా కొనసాగుతున్నారు.
శిక్షణాధికారిగా చేరి...
ఆర్టీసీలో 1998లో ట్రైనింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరారు. పదోన్నతులతో 2023నుంచి మెదక్ జిల్లా ఆర్‌ఎంగా ప్రభులత బాధ్యతలు కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment