నిమ్మయ్యకు జాతీయ అవార్డు
జగదేవ్‌పూర్(గజ్వేల్): గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న జగదేవ్‌పూర్ పీస్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ నిమ్మయ్య జాతీయ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియంలో పాన్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ముఫై ఏళ్లుగా పీస్ సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి పాన్ ఇండియా నేషనల్ అవార్డును ఎమ్మెల్సీ కోదండరాం, ప్రముఖ కవి గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా నిమ్మయ్య మాట్లాడుతూ నేషనల్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మరింత బాధ్యత పెంచిందన్నారు. గ్రామాభివృద్ధికి కృషి, సామాజిక కార్యక్రమాలు చేయడం సంస్థ లక్ష్యమన్నారు.
గుణాత్మకమైన
విద్యను అందించాలి
జిల్లా సెక్టోరియల్ అధికారి నర్సింహులు
దౌల్తాబాద్(దుబ్బాక): విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సెక్టోరియల్ అధికారి నర్సింహులు అన్నారు. మండల పరిధిలోని దౌల్తాబాద్, ముబారస్‌పూర్‌లోని ఎంజేపీ బాలికల రెసిడెన్సియల్ పాఠశాలలను సోమవారం ఆయన సందర్శించారు. రికార్డులను, విద్యార్థుల సమాచారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చడంలో ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసి విద్యాబోధన చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ గజ్జెల కనకరాజు, హెచ్‌ఎంలు ప్రకాశం, అప్జల్ హుస్సేన్, దుర్గా ప్రసాద్, సీఆర్పీలు, ఎమ్మార్సీలు తదితరులు పాల్గొన్నారు.
దోమల నియంత్రణకు
ఆయిల్ బాల్స్
మిరుదొడ్డి(దుబ్బాక): దోమల నివారణకు ఆయిల్‌బాల్స్ వేసే కార్యక్రమాన్ని మిరుదొడ్డి గ్రామ పంచాయతీ కార్మికులు ప్రారంభించారు. ఆయిల్ బాల్స్‌ను తయారు చేసి మురుగు కాలువల్లో వేస్తున్నారు. చిన్న చిన్న గోనె సంచుల్లో చెక్క పొట్టును నింపి బాల్స్‌లా తయారు చేస్తున్నారు. అలా తయారైన బాల్స్‌ను కిరోసిన్‌లో తడుపుతున్నారు. వాటిని ప్రధాన మురుగు కాలువల్లో అక్కడక్కడా వేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధిచెందకుండా పూర్తిగా నిర్మూలించవచ్చని పంచాయతీ కార్యదర్శి ఫహీం తెలిపారు.
కాంగ్రెస్ అధికార
ప్రతినిధిగా బుచ్చిరెడ్డి
సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా ముత్యాల బుచ్చిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా అధ్యక్షుడి నుంచి నియామక పత్రాన్ని అందుకున్న బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల పార్టీ ఇన్‌చార్జిలు హరికృష్ణ , శ్రీనివాస్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment