ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పోటీ పరీక్షల అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఆడిట్ అధికారి జయశ్రీ అన్నారు. మంగళవారం జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో జయశ్రీ పాల్గొని మాట్లాడారు. తాను 24 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి, గ్రూప్స్ రాసి జిల్లా ఆడిట్ ఆఫీసర్ గా నియమితులైనట్లు తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులు, విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. అనంతరం జిల్లా ఆడిట్ అధికారిని గ్రంథాలయ ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment