రంగనాయక్ సాగర్ కెనాల్‌తో ఎంతో లబ్ధి
కోహెడరూరల్(హుస్నాబాద్): రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు ఎల్డీ 6 కెనాల్‌తో మండలంలోని బస్వాపూర్, పోరెడ్డిపల్లితో పాటు పలు గ్రామాలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆర్డీఓ రామ్మూర్తి అన్నారు. కెనాల్ కింద భూమి కోల్పోతున్న రైతులతో బుధవారం బస్వాపూర్‌లో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రాజెక్టు కెనాల్ కింద 43 ఎకరాల భూమి కోల్పోతున్నట్లు తెలిపారు. రైతులందరూ సహకరిస్తే ఈ ప్రాంతానికి త్వరలోనే సాగు నీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ సతీష్, ఆర్ఐ గడ్డం సురేందర్, సర్వేయర్ శ్రీనివాస్, కార్యదర్శి సదానంద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment