సిద్దిపేటకమాన్: ప్రయాణికుల సురక్షితం, భద్రత కోసం అభయ యాప్ ఉపయోగ పడుతుందని సీపీ అనురాధ తెలిపారు. పోలీసు కమిషనరేట్లో అభయ యాప్ను బుధవారం ఏసీపీ మధుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు అభయ యాప్ స్టిక్కర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రయాణికులు, మహిళల రక్షణ కోసం ఆటో డ్రైవర్లకు అభయ యాప్ క్యూఆర్ కోడ్, పేపర్లను అందజేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,250 ఆటోలకు అభయ యాప్ స్టిక్కర్లను వేశామన్నారు. మిగతా ఆటోలకు త్వరలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రతి ఆటోకు క్యూఆర్ కోడ్ అతికించాలని సూచించారు. స్టిక్కర్లను ఆటోలో డ్రైవర్ సీటు వెనుక భాగంలో ఏర్పాటు చేయాలని, ఆటోలో సురక్షితంగా ప్రయాణిస్తున్నాననే నమ్మకం ప్రయాణికులకు కలిగించాల్సిన బాధ్యత డ్రైవర్లపై ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment