సర్వతోముఖాభివృద్ధికే.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి
ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదు చేయండి
ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో మహిళలకు ఇబ్బందులు ఎదురైతే తమ సెల్‌ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆటో పూర్తి వివరాలు పోలీసులకు తెలుస్తాయన్నారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే వెళ్లడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆటో డ్రైవర్ ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించినా, ఈవ్ టీజింగ్, ర్యాష్ డ్రైవింగ్, హిట్ అండ్ రన్, డ్రంకెన్ డ్రైవ్ వంటివి చేసినా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అభయ యాప్ (రూ.50)తో డ్రైవర్లకు రోడ్డు ప్రయాదంలో మరణిస్తే రూ.లక్ష ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. అభయ యాప్ రూపకర్త అభిచరణ్, ఆటో డ్రైవర్లను సీపీ అభినందించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులతో ప్రయాణించకూడదని ఆటో డ్రైవర్లకు సీపీ సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ మధు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌గౌడ్, వన్ టౌన్ సీఐ వాసుదేవరావు, రూరల్ సీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment