ఆయిల్‌పాం అడ్డాగా మారాలి
సిద్దిపేటరూరల్: జిల్లా ఆయిల్‌పాం అడ్డాగా మారాలని, సాగు పెరిగేలా రైతులను చైతన్యపరచాలని కలెక్టర్ మనుచౌదరి వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఆయిల్ పామ్ సాగుపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు అనేకమైన అనుకూల అంశాలున్నాయన్నారు. సాగుతో వరుసగా అధిక ఆదాయం పొందడమే కాకుండా అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం వేగంగా జరుగుతున్నందున మార్కెటింగ్ సౌకర్యం కూడా సులభం అవుతుందన్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి, కలిగే ప్రయోజనాలను వివరించి ఆయిల్‌పాం పంటలు వేసేలా ప్రోత్సహించాన్నారు. టార్గెట్ కు అనుగుణంగా ఆయిల్ పాం మొక్కలను నాటించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
కొనుగోలు కేంద్రాలను విజిట్ చేయండి
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ అధికారులు రెగ్యులర్ గా విజిట్ చేసి సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. హార్వెస్టర్ తో వరిధాన్యాన్ని కోసేటప్పుడు తాలు అక్కడే పోయేలా హార్వెస్టర్‌లో బ్లోయర్ వేయించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, హార్టికల్చర్ అధికారి సువర్ణ, వ్యవసాయ అధికారి రాధిక, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సాగుపై రైతులను చైతన్యపరచాలి
కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
వ్యవసాయ, హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ అధికారులకు దిశానిర్దేశం
Comments
Please login to add a commentAdd a comment