వైద్యసేవల్లో నిర్లక్ష్యం తగదు
దుబ్బాక: ప్రభుత్వం పేదలకు అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్‌కుమార్ అన్నారు. బుధవారం దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని వార్డులను కలియ తిరిగారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందుల కొరత లేకుండా అన్ని సౌకర్యాలున్నట్లు తెలిపారు.
దుబ్బాక ఆస్పత్రి సేవలు భేష్
దుబ్బాక ఆస్పత్రిలో కార్పొరేట్‌కు దీటుగా సేవలు అందుతుండటం అభినందనీయమని కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. అరుదైన ఆపరేషన్లు చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న వైద్యులను, సిబ్బందిని కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ హేమరాజ్‌సింగ్‌ను వైద్యసేవలతో పాటు సౌకర్యాలు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అభివృద్దికి కృషి చేస్తానన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం
అందించాలి
రాష్ట్ర వైద్య విధాన పరిషత్
కమిషనర్ అజయ్‌కుమార్
దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి
ఆకస్మిక తనిఖీ
Comments
Please login to add a commentAdd a comment