రీ సైక్లింగ్ దందా
బుధవారం శ్రీ 8 శ్రీ జనవరి శ్రీ 2025
దారిమళ్లుతున్న సీఎంఆర్ ధాన్యం
డివిజన్ సాధించే వరకు ఉద్యమిస్తాం
● జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామంలోని ఒకటవ రేషన్ షాప్‌లో బియ్యం పంపిణీ చేస్తుండగా వివాహ వేడుకల్లో ఉపయోగించిన చమ్కీలు, థర్మకోల్ బాల్స్ దర్శన మిచ్చాయి. వెంటనే ఆ బస్తాను సదరు రేషన్ డీలర్ పక్కపెట్టి.. మరో బస్తాను ఓపెన్ చేసి సరఫరా చేశారు. ఇలా చమ్కీలు, కలర్ థర్మకోల్ బాల్స్ రావడంతో రేషన్ డీలర్‌తోపాటు లబ్ధిదారులు కంగుతిన్నారు.
● గజ్వేల్‌లోని సాయివీరభద్ర రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 179 క్వింటాళ్ల రేషన్ బియ్యంను గత నెల 13న టాస్క్‌ఫోర్స్, సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు. సదరు మిల్లుపై అధికారులు కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా తరుచూ జరుగుతుండటంతో రీ సైక్లింగ్ దందా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
సాక్షి, సిద్దిపేట: కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించి మిల్లుకు తరలించిన ధాన్యం పక్కదారి పడుతోంది. మరాడించి బియ్యాన్ని ఎక్కువ ధరకు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుంటూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడితో ఆగకుండా లబ్ధిదారులు, రేషన్ డీలర్ల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కింద అప్పగిస్తున్నారు. బహిరంగమార్కెట్‌లో ధాన్యానికి డిమాండ్ ఉండటంతో మిల్లర్లు రీసైక్లింగ్ దందాకు తెరలేపుతున్నారు.
ఏజెంట్‌ల ద్వారా కిలో రూ.10
ప్రతీ వానాకాలం, యాసంగి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ వారు జిల్లాలోని 150 మిల్లర్లకు అందిస్తుంది. ఈ ధాన్యం సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద క్వింటాల్ వడ్లకు రా రైస్ 67 కిలోలు, బాయిల్డ్ రైస్ 68 కిలోలు అందించాల్సి ఉంది. పల్లెలు, పట్టణాల్లో ఏజెంట్లను పెట్టుకున్న మిల్లర్లు లబ్ధిదారుల నుంచి కిలో బియ్యం రూ. 8 నుంచి రూ.10లకు పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని డంప్ చేసి, ఒకే సారి పెద్దమొత్తంలో రేషన్ బియ్యం రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. పీడీఎస్ బియ్యం క్వింటాల్‌కు సుమారుగా వెయ్యి రూపాయలు చెల్లిస్తుండగా, రైతుల నుంచి సేకరించిన ధాన్యంను మరాడించి బహిరంగమార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.3వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా ఒక్కో క్వింటాలుపై రూ. 2వేల వరకు లాభం వస్తుండటంతో మిల్లర్లు అక్రమ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంతంతమాత్రంగానే తనిఖీలు
మిల్లర్లకు అందించిన ధాన్యం నిల్వలపై అధికారులు అంతంతమాత్రంగానే తనిఖీలు చేస్తుండటంతో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. వడ్లను మరాడించే సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సీఎంఆర్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో వరి తక్కువగా సాగవడం మార్కెట్‌లో వడ్లకు డిమాండ్ ఉండటంతో ఆక్రమ దందా చేస్తున్నారు.
జగదేవ్‌పూర్ మండలం తిగుల్‌లోని
రేషన్ బియ్యంలో చమ్కీలు, థర్మకోల్ బాల్స్
న్యూస్‌రీల్
నాలుగేళ్లలో
14వేల క్వింటాళ్ల బియ్యం పట్టివేత
గజ్వేల్‌లోని మిల్లులో
పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్వాధీనం
తిగుల్ రేషన్ రైస్‌లో
పెళ్లి తలంబ్రాల చమ్కీలు
జిల్లాలో మిల్లర్ల ఇష్టారాజ్యం
నాలుగేళ్లలో భారీగా పట్టివేత..
నాలుగేళ్లలో అక్రమంగా రవాణా అవుతున్న
14,389 క్వింటాళ్ల రేషన్ బియ్యంను
సివిల్ సప్లయ్ అధికారులు పట్టుకున్నారు.
సంవత్సరం కేసులు పట్టుకున్న బియ్యం
2021 61 3,285
2022 71 6,377
2023 18 992
2024 102 3,735
వారికే అమ్మాలి...!
జిల్లాలో ప్రధానంగా నలుగురు బియ్యం వ్యాపారులు కొనుగోలు చేసి మిల్లులకు రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నలుగురు వ్యాపారులకే ఏజెంట్‌లు బియ్యం విక్రయించాలి. ఈ నలుగురి దగ్గరి నుంచే మిల్లుల యజమానులు కొనుగోలు చేయాలి. లేనట్లయితే అక్రమంగా సరఫరా చేస్తున్న క్రమంలో అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ఈ నలుగురు బియ్యం వ్యాపారులకు ఆ శాఖలో పని చేసే సిబ్బంది ఒకరితో సంబఽంధం ఉన్నట్లు సమాచారం.
(క్వింటాళ్లు)
మా దృష్టికి రాలేదు..
రేషన్ షాప్‌నకు సరఫరా చేసిన బియ్యంలో చమ్కీలు వచ్చినట్లు మా దృష్టికి రాలేదు. ప్రభుత్వం అందించే రేషన్ బియ్యంను మార్కెట్‌లో అమ్మినా.. కొనుగోలు చేసినా చర్యలు తీసుకుంటాం. రేషన్ బియ్యం అక్రమంగా మిల్లుల్లో ఉంటే వారిపై కేసులు నమోదు చేస్తాం. రేషన్ బియ్యం ఎక్కడైనా డంప్ చేసి ఉంటే సివిల్ సప్లయ్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. – తనూజ, డీఎస్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment