నిర్దేశించిన లక్ష్యం అధిగమించాలి
అదనపు కలెక్టర్ హమీద్
సిద్దిపేటజోన్: ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం అధిగమించేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన సిద్దిపేట మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్‌తో సమావేశం నిర్వహించారు. సిద్దిపేట బల్దియా పనితీరు, లక్ష్యాలు, వివిధ పన్నుల వసూళ్లు, ప్రజాసేవలు, సిటిజన్ చార్టర్ తదితర అంశాలపై అరా తీశారు. అనంతరం మున్సిపల్ రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, బిల్ కలెక్టర్ల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. మున్సిపల్ పనితీరు మరింత మెరుగుపడాలన్నారు. వందశాతం ఆస్తి పన్ను వసూలు చేసి అగ్రగామిగా ఉండేలని సూచించారు. మార్చి31 వరకు ఆఖరి గడువు ఉన్నందున ఒక ప్రణాళిక మేరకు ముందుకు సాగాలని సూచించారు. పట్టణంలో అందరూ ట్రేడ్ లైసెన్స్ తీసుకునేలా వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment