చలి పంజా
చలి.. పంజా విసురుతోంది. జనం గజగజ వణుకుతున్నారు. జిల్లాలో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చల్లగాలులు వీస్తున్నాయి. చలికి జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఉదయం చలి తీవ్రతతో పాటు పొగ మంచు కమ్ముకుంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. మంగళవారం జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీలు నమోదైంది. చలిని తట్టుకోవడానికి మంకీ క్యాపులు, మఫ్లర్లు, రుమాళ్ళు, స్వెట్టర్లు ధరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
– మిరుదొడ్డి(దుబ్బాక)
పల్లెల్లో ఉదయం నిత్యం పొగ మంచు కురుస్తుంటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు. గ్రామాలన్నీ పొగ మంచుతో నిండిపోతున్నాయి. ప్రధాన రహదారులన్నీ పొగ మంచు కప్పేస్తుండటంతో వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. కనుచూపు మేర దట్టమైన పొగ మంచు అలుముకుంటుండటంతో అడపాదడపా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వాహనదారులు లైట్ల వెళుతురులో ప్రాయాణించాల్సి వస్తోంది.
చలి మంటలతో
ఉపశమనం
రాత్రయ్యిందంటే చాలు ఏడు గంటలకే జనాలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. వృద్ధులు, చిన్నారులతో పాటు ఆస్తమా వ్యాధి గ్రస్తులు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అస్తమా వ్యాధిగ్రస్తులు శ్వాస సంబంధమైన ఇబ్బందులతో ఇక్కట్లు పడుతున్నారు. పంజా విసురుతున్న చలిని తట్టుకోవడానికి జనాలు చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు.
చలితో ఎదగని నారు
చలి తీవ్రత వ్యవసాయ సాగుపై తీవ్రంగా పడుతోందని రైతులు వాపోతున్నారు. వరిని సాగు చేయడానికి చలి కారణంగా నారు ఎదగడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొగ మంచులో ప్రమాదకరంగా
వాహనాల రాకపోకలు
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఉదయం వేళ పొగమంచుతో
జనం ఉక్కిరిబిక్కిరి
ఇబ్బందుల్లో వృద్ధులు, చిన్నారులు
జిల్లాలో 10 డిగ్రీలలోపే
కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
జాగ్రత్తలు తీసుకోవాలంటున్న
అధికారులు
జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు ఇలా..
నియోజకవర్గం గత డిసెంబర్ నెల ప్రస్తుతం
దుబ్బాక 6.5 6.5
సిద్దిపేట 12 10
గజ్వేల్ 7.6 7.2
హుస్నాబాద్ 9.8 9.6
(డిగ్రీలలో..)
Comments
Please login to add a commentAdd a comment