నారుమడిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
చలికాలం నారుమడిపై రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోతే చలి తీవ్రత పెరగిపోయి నారు ఎదగకుండా ఎర్రబడి చనిపోతుంది. ఉదయం సాయంత్రం నీరు మారుస్తూ ఉండాలి. ఎకరా నారుమడికి అరకిలో యూరియా, అర కిలో భాస్వరం, అర కిలో పొటాష్‌ను చల్లుకోవాలి. చలి ప్రభావాన్ని తట్టుకోవడానికి నారుమడిపై నాలుగు వెదురు బొంగులు లేదా కర్రల సహాయంతో పందిరిలా కవరును కప్పి ఉదయం తీసివేయాలి.
– బత్తిని సత్యాన్వేష్, అక్బర్‌పేట–భూంపల్లి మండల వ్యవసాయ అధికారి
Comments
Please login to add a commentAdd a comment