చైనా మాంజావిక్రయిస్తే చర్యలు
గజ్వేల్‌రూరల్: ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజాను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు. గజ్వేల్ పట్టణంలో ఓ వ్యక్తి తన కిరాణా దుకాణంతో పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 3కిలోల చైనా మాంజా బండల్స్‌ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ చైనా మాంజా వాడకం వల్ల మనుషులతో పాటు పక్షులకు సైతం హాని జరిగే అవకాశముందని, చైనా మాంజా మెడకు, కాళ్లకు తగిలి చనిపోయిన సంఘటనలు సైతం ఉన్నాయన్నారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ పోలీసులకు (87126 67445, 87126 67446, 87126 67447) సమాచారం అందించాలని సూచించారు.
రూ.1,19,700 విలువైన మాంజా స్వాధీనం
సిద్దిపేటకమాన్: ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రభుత్వ నిషేధిత చైనా మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ ఉపేందర్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని బాలాజీ బుక్ డిపోకు చెందిన మురళీ అతడి ఇంట్లో నిషేధిత చైనా మాంజా కలిగి ఉన్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రూ.1,19,700 విలువ గల చైనా మాంజా బండిల్స్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎస్‌ఐ సాయిప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment