‘డివిజన్’ సాధించే వరకు పోరాటం
సిద్దిపేటరూరల్: చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేవరకు ఉద్యమం ఆగదని జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణి లో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా డివిజన్ కోసం పోరాడుతున్నామన్నారు. గతంలో డివిజన్ కోసం ధర్నా నిర్వహిస్తున్నప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని మాట ఇచ్చారన్నారు. అదేవిధంగా సీఎం కూడా డివిజన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇరువురు హామీని నిలబెట్టుకోవాలని కోరారు. రెవెన్యూ డివిజన్ పాత జిల్లాలో ఉండడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అన్ని పార్టీల నాయకులతో కలుపుకొని ఐక్య ఉద్యమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మున్సిపల్ చైర్మన్ వంగ స్వరూప రాణి, ఆముదాల మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ రాజేందర్, బాల్ నరసయ్య, అఖిల పక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం హామీని అమలు చేయాలి
జేఏసీ చైర్మన్ వకుళాభరణం నరసయ్య
Comments
Please login to add a commentAdd a comment