అర్జీలు సత్వరమే పరిష్కారం
సిద్దిపేటరూరల్: ప్రజలు అందించిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కారానికి చర్యలు చేపట్టి రిపోర్ట్‌ను కలెక్టర్‌ట్‌లో అందించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, భూసమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 96 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, కలెక్టరేట్ ఏఓ అబ్దుల్ రహమాన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అవినీతి అధికారిని తొలగించండి
అవినీతి అధికారిని తొలగించాలని కాంట్రాక్టర్ కలీముద్దీన్ డిమాండ్ చేశారు. ప్రజావాణిలో ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్‌గా పలు నిర్మాణాలు చేపడుతున్నానన్నారు. జిల్లా గృహనిర్మాణ శాఖ విభాగంలో ఇంజనీరింగ్ పై ఎలాంటి అవగాహన లేని రిటైర్డ్ ఉపాధ్యాయుడిని అవుట్‌సోర్సింగ్‌గా కొనసాగించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. నిర్మాణం అనంతరం కాంట్రాక్టర్లు పేమెంట్ కోసం వస్తే బిల్లులపై లేనిపోని సమస్యలు సృష్టిస్తూ 5శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. చింతమడక గ్రామంలోని లబ్ధిదారుల నుంచి కూడా డబ్బులను డిమాండ్ చేస్తున్నారన్నారు.
అవకతవకలపై ఫిర్యాదు
సిద్దిపేటకమాన్: చిన్నకోడూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో అవకతవకలు జరిగాయని ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని బీజేపీ చిన్నకోడూరు మండల నాయకులు తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో సోమవారం వారు మాట్లాడుతూ.. ఆర్‌టీఐ చట్టం ప్రకారం దరఖాస్తు చేయగా వచ్చిన సమాచారంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. రెవెన్యూ రికార్డులు, సర్టిఫికెట్ల జారీలో అవకతవకలు జరిగాయన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
ప్రజావాణిలో 96 దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment