ఒక్కటే..
బీజేపీ, బీఆర్‌ఎస్
హుస్నాబాద్: ఆర్థిక వెసులుబాటుతో సంక్షేమ పఽథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సోమవారం హుస్నాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్థిక విధ్యంసం చేసి, రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు అప్పజెప్పిందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రాధాన్యత ఉన్న పఽథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారన్నారు. 55వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. రైతు భరోసా పేరిట వ్యవసాయ యోగ్యమైన భూమికి ఏటా ఎకరాకు రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. బీజేపీ ప్రభుత్వానికి రైతుల ప్రేమ ఉంటే మేము ఇస్తున్న రైతు భరోసాకు మరో రూ.12వేలు జమ చేయాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లకు రూ.500 బోనస్, భూమి లేని పేదలకు రూ.12వేలు, రైతు రుణ మాఫీ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టే రైతు వ్యతిరేక చట్టాలను తెస్తోందన్నారు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కేటీఆర్‌లు ఒకే స్వరంలో మాట్లాడుతున్నారని తెలిపారు.
వారివి అర్థంలేని ఆరోపణలు
గుట్టలకు, రాళ్లకు రైతు భరోసా ఇవ్వాలా? తేల్చాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
డబుల్ లేన్ రోడ్డుకు రూ.25కోట్లు
అక్కన్నపేట(హుస్నాబాద్): హుస్నాబాద్ మీదుగా రామవరం గ్రామం వరకు నిర్మించనున్న డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్ల నిధులు మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలపారు. ఈమేరకు సోమవారం రహదారి నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డబులలేన్ రోడ్డు నిర్మాణానికి సీఆర్‌ఐఎఫ్ నిధులు రూ.25కోట్లు మంజూరయ్యాయన్నారు. మూలమలుపులు లేకుండా నాణ్యతతో కూడిన రోడ్డును నిర్మించనున్నామన్నారు. అలాగే త్వరలోనే మండలంలోని చౌటపల్లి క్రాసింగ్ వద్ద ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని సర్వేలను పూర్తి చేశారన్నారు. త్వరలోనే నోటిఫికేషన్ సైతం రానున్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ప్రకారం రైతులకు భరోసా పథకం కింద డబ్బులను త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment