విద్యార్థులతో మాటామంతి..
హుస్నాబాద్‌లోని ప్రభుత్వ మైనార్టీ బాలికల రెసిడెన్సియల్ పాఠశాలను ఆదివారం మంత్రి పొన్నం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మంత్రి మాటామంతి జరిపారు. గతంలో సాధించిన విజయాలను వారితో పంచుకున్నారు. వారితో కలిసి భోజనం చేశారు. కాస్కోటిక్ కిట్లు, షూస్, యూనిఫామ్‌లు రాలేదని విద్యార్థినులు మంత్రి దృష్టికి తెచ్చారు. అలాగే ఇంటర్మీడియెట్ వరకు ఉన్న మెనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలను డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. వెంటనే సమస్యలపై మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ తాప్సిర్ ఇక్బాల్, సీఎం సెక్రటరీ షానవాజ్ కాసింతో మంత్రి మాట్లాడారు. డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment