పోరాటంతోనే సమస్యలు పరిష్కారం
పటాన్‌చెరుటౌన్: కార్మిక,కర్షక,ప్రజాసమస్యలు పరిష్కారం అవ్వాలంటే ఉద్యమాలు, పోరాటాలతోనే సాధ్యమని సీపీఎం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం చైర్మన్, సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం పటాన్‌చెరు పట్టణంలో మహాసభల వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున్‌తో కలసి 2కే రన్‌లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రామచంద్రపురంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు జరిగిన 2 కే రన్‌ను చుక్కా రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కార్మిక వర్గ సమస్యలు పోరాటాలతోనే పరిష్కారం అవుతాయే తప్ప పాలకుల దయాదాక్షిణ్యాలపై కాదని ఇప్పటికే అనుభవంలో రుజువైందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గం పైనే దాడి చేస్తోందని 49 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో జరిగే సీపీఎం రాష్ట్ర మహాసభలో కార్మిక కర్షక ప్రజా సమస్యలపై చర్చించి కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు
చుక్కా రాములు
పటాన్‌చెరులో 2కే రన్
Comments
Please login to add a commentAdd a comment