ముందస్తు సంబురాలు
జిల్లా కేంద్రానికి ముందే సంక్రాంతి శోభ వచ్చేసింది. ముందస్తు సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిద్దిపేట నియోజకవర్గం ఇన్‌చార్జి దూది శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో సంక్రాంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా గ్రౌండ్‌ను అలంకరించారు. రంగురంగుల ముగ్గులు వేశారు. ముగ్గులపై గొబ్బెమ్మలు పెట్టారు. భోగిమంటలు వేసి చుట్టూ నృత్యాలు చేసి మహిళలు సందడి చేశారు. అక్కడికి వచ్చిన ప్రజలంతా సామూహికంగా ముందస్తుగా సంక్రాంతిని ఆహ్వానించారు. విద్యార్థుల వేషధారణలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు పిండి వంటలు చేసి ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
Comments
Please login to add a commentAdd a comment