నీళ్ల కోసం మరో ఉద్యమం
దుబ్బాక: జిల్లాలోని పంటలకు నీళ్లివ్వకుంటే హైదరాబాద్‌కు వెళ్లే మల్లన్నసాగర్ జలాలను అడ్డుకుంటామని.. అవసరమైతే నీళ్ల కోసం మరో ఉద్యమం చేపడతామని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం దుబ్బాక మండల పరిధిలోని హబ్షీపూర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై నియోజకవర్గంలోని రైతులు, బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి భారీ ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఎల్కతుర్తి–మెదక్ జాతీయ రహదారిపై గంటకు పైగా బైఠాయించి ఆందోళన చేపట్టడడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. వినకపోవడంతో బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులను, ప్రజలను మోసం చేయడమే ప్రజాపాలననా? అంటు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మల్లన్నసాగర్ కాలువల నిర్మాణం ఆగిపోయిందన్నారు. కనీసం చెరువులు, కుంటల్లో తట్టెడు మన్ను తీసిన దాఖలాలు లేవన్నారు. మల్లన్నసాగర్ కాలువలు పూర్తి చేసి పొలాలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు తదితరులు ఉన్నారు.
నగరానికి వెళ్లే‘మల్లన్న’ జలాలను అడ్డుకుంటాం
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment