మరింత సహకారం
మంగళవారం శ్రీ 7 శ్రీ జనవరి శ్రీ 2025
మరింత ‘సహకారం’
సాక్షి, సిద్దిపేట: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచే సహకార సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా సహకార సంఘాల సేవలు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించారు. ముందుగా ఆయా పీఏసీఎస్‌లు, ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలను జిల్లా సహకార శాఖ స్వీకరించింది. జిల్లాలో నూతనంగా 16 సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
గ్రామాల్లో సేవలు విస్తరించేందుకు..
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 87,197 సభ్యులున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు, పంట రుణాల పంపిణీ, గిడ్డంగులు, పెట్రోల్ బంక్‌లు, ఇలా పలు సేవలు రైతులకు అందిస్తున్నారు. కొత్తగా మండలాలు ఏర్పడినప్పటికీ మండల కేంద్రాల్లో పీఏసీఎస్‌లు లేవు. ఈ క్రమంలో అన్ని మండల కేంద్రాల్లో, అవసరం ఉన్న గ్రామాల్లో సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టింది.
37కు చేరుకోనున్న సంఘాలు..
కొన్ని సంవత్సరాలుగా కొత్తగా సంఘాలు ఏర్పాటు చేయలేదు. గతంలో నష్టాల్లో ఉన్న సంఘాలను మరో సంఘంలో విలీనం చేశారే తప్ప కొత్తవి ఏర్పాటు చేయలేదు. పలు పాత, కొత్త మండల కేంద్రాల్లో సైతం సంఘాలు ఏర్పాటు చేయలేదు. గత ప్రభుత్వం మండలానికి రెండు సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు స్వీకరించింది. కానీ ఏర్పాటు చేయలేదు. మళ్లీ ఇటీవల కొత్త, పాత మండల కేంద్రాల్లో సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు స్వీకరించారు. కొత్తగా 16 సంఘాలు ఏర్పాటు చేస్తే జిల్లాలో సహకార సంఘాలు 37కు చేరుతుంది. దీంతో రైతులకు అందుబాటులో సేవలు లభ్యమవుతాయి.
కొత్తగా సొసైటీలు ఏర్పాటయ్యే గ్రామాలు ఇవే..
న్యూస్‌రీల్
జిల్లాలో మరిన్ని కొత్త సొసైటీలు
ప్రస్తుతం 21 సంఘాలు.. 87వేల మంది సభ్యులు
మరో 16 కొత్త వాటి కోసంప్రతిపాదనలు
మండలం గ్రామం
చిన్నకోడూరు చిన్నకోడూరు,
ఇబ్రహీంనగర్
నారాయణరావుపేట నారాయణరావుపేట,
గుర్రాలగొంది
అక్బర్‌పేట–భూంపల్లి అక్బర్‌పేట–భూంపల్లి
రాయపోలు రాయపోలు
మర్కూక్ మర్కూక్
దూల్మిట్ట దూల్మిట్ట
అక్కన్నపేట అక్కన్నపేట
కుకునూరుపల్లి కుకునూరుపల్లి
సిద్దిపేట రూరల్ సిద్దిపేట రూరల్
కొమురవెల్లి కొమురవెల్లి
హుస్నాబాద్ రామవరం
గజ్వేల్ పిడ్‌చెడ్
నంగనూరు నర్మెట్ట
బెజ్జంకి బేగంపేట
ప్రతిపాదనలు పంపించాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతిపాదనలను స్వీకరించాం. అందరి అభిప్రాయాలను తీసుకొని నివేదించాం. జిల్లాలో కొత్తగా 16 సంఘాలు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాం.
– నాగేశ్వర్ రావు, డీసీఓ
Comments
Please login to add a commentAdd a comment