గిల్‌తో అయ్యర్ (PC: BCCI/ X)
India vs Australia, 1st ODI: టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు కాలం కలిసి రావడం లేదు. వెన్నునొప్పి కారణంగా నెలల తరబడి జట్టుకు దూరమైన అతడు.. ఆసియా కప్-2023తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, రెండు మ్యాచ్‌లు ఆడగానే అర్థంతరంగా వైదొలిగాడు.
రాహుల్, ఇషాన్ ఫిక్స్ అయిపోయారు
గాయం తిరగబెట్టడంతో కీలక మ్యాచ్‌లు సహా ఫైనల్ ఆడలేకపోయాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ నాలుగో నంబర్‌లో అదరగొడుతూ.. అయ్యర్ స్థానానికి ఎసరు పెట్టేశాడు. ఐదో స్థానంలో పాతుకుపోయేందుకు ఇషాన్ కిషన్ కూడా సిద్ధమయ్యాడు.
ఇలాంటి పరిస్థితుల్లో వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాతో కీలక సిరీస్‌లో పాల్గొనే అవకాశం అయ్యర్‌కు వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా సీనియర్ల విశ్రాంతి నేపథ్యంలో తుదిజట్టులో అతడికి చోటు దక్కింది.
రనౌట్.. 3 పరుగులకే పెవిలియన్‌కు
ఈ క్రమంలో శుక్రవారంనాటి తొలి మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ తన తొందరపాటుతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌తో సమన్వయలోపంతో వికెట్ పారేసుకున్నాడు.
23వ ఓవర్ నాలుగో బంతికి ఆడం జంపా బౌలింగ్‌లో బాల్‌ను టచ్ చేసిన అయ్యర్.. పరుగు కోసం యత్నించాడు. కానీ గిల్ రెస్పాండ్ అవ్వలేదు. దీంతో అయ్యర్ పిచ్ మధ్యలోకి పరిగెత్తే సరికే బాల్ కలెక్ట్ చేసుకున్న ఫీల్డర్.. దానిని వికెట్ కీపర్ వైపునకు విసిరాడు.
జోష్ ఇంగ్లిస్ ఏమాత్రం జాప్యం లేకుండా బంతిని ఒడిసిపట్టి వికెట్లకు గిరాటేశాడు. అప్పటికి అయ్యర్ డైవ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయర్ అయ్యర్ వెనుదిరగాల్సి వచ్చింది.
తప్పు నీదే.. గిల్‌ను అంటావా?
ఈ క్రమంలో గిల్‌పై అయ్యర్ కాస్త ఫైర్ అయినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో అయ్యర్‌పై విమర్శలు వస్తున్నాయి. నిజానికి అక్కడ తప్పు అయ్యర్‌దే కావడంతో అభిమానులు సైతం అతడిని ఏకిపారేస్తున్నారు.
రాక రాక ఆడే అవకాశం వస్తే నిర్లక్ష్యంతో రనౌట్ అవుతావా? ఇదేం పద్దతి? ఛాన్స్ రాని వాళ్లు రాక ఏడిస్తే నువ్వేమో ప్రతీ అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నావు. ఇలా అయితే, వన్డే వరల్డ్‌కప్ జట్టు నుంచి నిన్ను తీసేసినా ఆశ్చర్యం లేదు.. ఇకనైనా జాగ్రత్తగా ఆడు అయ్యర్ అంటూ సోషల్ మీడియా వేదికగా చురకలు అంటిస్తున్నారు. ఇంకొందరేమో అయ్యర్‌ను తప్పించి వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అదరగొట్టిన ఓపెనర్లు.. టీమిండియా విజయం
కాగా సెప్టెంబరు 28 వరకు ప్రపంచకప్ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆసీస్‌తో తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ 71, శుబ్‌మన్ గిల్ 74 పరుగులతో చెలరేగగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ ఫిఫ్టీ సాధించి వరుస వైఫల్యాలకు తెరదించాడు.
చదవండి: వారణాసి క్రికెట్ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని మోదీ
Sealed with a SIX.
— BCCI (@BCCI) September 22, 2023
Captain @klrahul finishes things off in style.#TeamIndia win the 1st ODI by 5 wickets.
Scorecard - https://t.co/H6OgLtww4N… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/PuNxvXkKZ2
Shreyas Iyer run out #INDvsAUS #ShreyasIyer #subhmangill #Gill #RuturajGaikwad #zampa pic.twitter.com/p9s0TwzVba
— SRKxTAYLOR (@Srkxtaylor) September 22, 2023
Comments
Please login to add a commentAdd a comment