
యశస్వి జైశ్వాల్ (PC: BCCI)
India vs Australia, 2nd T20I: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అరుదైన ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టాస్ ఓడిన సూర్య సేన తొలుత బ్యాటింగ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, రుతురాజ గైక్వాడ్ అర్ధ శతకాలతో శుభారంభం అందించారు. ముఖ్యంగా యశస్వి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 25 బంతుల్లోనే 53 పరుగులు సాధించాడు. తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో యాభై పరుగుల మార్కు పూర్తి చేసుకున్నాడు.
పవర్‌ప్లే వీరుడిగా
ఈ నేపథ్యంలో యశస్వి జైశ్వాల్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ పేరిట ఉండేది.
ఇదిలా ఉంటే.. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. యశస్వి, రుతురాజ్(58)తో పాటు ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ(52) చేయగా.. రింకూ సింగ్ 9 బంతుల్లోనే 31 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో 235 పరుగులు చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియాను 191 పరుగులకే కట్టడి చేసి గెలుపొందింది. తదుపరి గువాహటి వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 జరుగనుంది.
అంతర్జాతీయ టీ20లలో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత బ్యాటర్లు
►హోమిల్టన్‌లో 2020లో న్యూజిలాండ్ మీద రోహిత్ శర్మ- 50(23) నాటౌట్
►దుబాయ్‌లో 2021లో స్కాట్లాండ్ మీద కేఎల్ రాహుల్- 50(19)
►తిరువనంతపురంలో 2023లో ఆస్ట్రేలియా మీద యశస్వి జైశ్వాల్- 53(25).
చదవండి: IPL 2024: 13 కోట్ల ఆటగాడిని వదిలేసిన సన్‌రైజర్స్.. మరో బౌలర్‌కు ఝలక్
Comments
Please login to add a commentAdd a comment