కసుమూరులో బెల్టు దుకాణం
● విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
వెంకటాచలం: అధికార పార్టీ అండ చూసుకుని కొందరు రెచ్చిపోతున్నారు. వేలాది మంది భక్తులు వచ్చే ప్రాంతాల్లో బెల్టు దుకాణాలను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. వెంకటాచలం మండలంలోని కసుమూరు గ్రామంలో ఉన్న మస్తాన్‌వలీ దర్గా దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. కూటమి ప్రభుత్వంలో కసుమూరులో మద్యం ఏరులై పారుతోంది. ఇక్కడ మద్యం షాపు ఉంది. ఇది ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటోంది. దీనికి సమీపంలోనే ఒకటి, ఊర్లోనే మరొక బెల్టు దుకాణాలను పెట్టారు. సమయంతో పని లేకుండా ఇక్కడ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా కసుమూరులో బెల్టు దుకాణాలు పెట్టి విచ్చలవిడిగా అమ్మకాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెల్లవారుజామున మద్యం తాగిన వారు దర్గా వద్దకు వచ్చి భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కసుమూరులో బెల్టు దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment