పోలీసుల త్యాగాలను స్మరించుకుందాం
● ఏఎస్పీ సీహెచ్ సౌజన్య
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్‌హాల్లో వివిధ కాలేజీల విద్యార్థులకు పోలీసుల త్యాగాలపై మంగళవారం సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎందరో ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తున్నారన్నారు. సమసమాజం, ప్రజా రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారి త్యాగాలను అందరూ గుర్తుంచుకోవాలన్నారు. యువత పోలీసు శాఖ వైపు ఆసక్తి చూపాలన్నారు. గంజాయికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం పలువురు వక్తులు మాట్లాడుతూ యువత ప్రేమ పేరిట మోసపోవద్దని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మోటివేషనల్ స్పీకర్ నరసింహారెడ్డి, నగర, ఏఆర్, డీటీసీ డీఎస్పీలు డి.శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, గిరిధర్, డీటీసీ, ఎస్‌బీ – 2 ఇన్‌స్పెక్టర్‌లు మిద్దె నాగేశ్వరమ్మ, బి.శ్రీనివాసరెడ్డి, వెల్ఫేర్, హెచ్‌జీ ఆర్‌ఐలు రాజారావు, థామస్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment