జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌కుమార్ సస్పెన్షన్
నెల్లూరు సిటీ: నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌కుమార్‌ను కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ చేస్తూ ఆర్డీఓ అనూష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న ‘టపాసుల దుకాణాల కేటాయింపు రసాభాస’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆర్డీఓ అనూష స్పందించారు. ఈ పరిస్థితికి కారణమైన జూనియర్ అసిస్టెంట్ శ్రావణ్‌కుమార్‌పై వస్తున్న ఆరోపణలను విచారించారు. ఈ క్రమంలో లాటరీ విధానంలో శ్రావణ్‌కుమార్ అవకతవకలకు పాల్పడ్డారని గుర్తించారు. దీంతో ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment