రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
● జాయింట్ కలెక్టర్ కార్తీక్
నెల్లూరు(దర్గామిట్ట): రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో మంగళవారం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామసభలను పూర్తి చేయాలన్నారు. రీసర్వేకు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని, మండల సర్వేయర్లు క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలన్నారు. రోజూ రెవెన్యూ డివిజనల్ అధికారులు మండల స్థాయిలో పెండింగ్ అంశాలపై సమీక్ష చేయాలన్నారు. అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. రెవెన్యూ అధికారులందరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా సర్వే అధికారి వై.నాగశేఖర్, ఆత్మకూరు ఆర్డీఓ పావని, నెల్లూరు ఆర్డీఓ అనూష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment