రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 43.086 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 9,700 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. సత్యసాయిగంగ కాలువకు 1,400, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 10, మొదటి బ్రాంచ్ కాలువకు 10 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాపూరులో
రక్తదాన శిబిరం
రాపూరు: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం వారోత్సవాల్లో భాగంగా మంగళవారం రాపూరు ప్రభుత్వ వైద్యశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎస్సై వెంకటరాజేష్ మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో ఎంతో సేవ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఏఎస్సై వెంకటేశ్వరావు, వైద్యులు రేష్మ, హరీష్, సరస్వతి, రక్తదాతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment