గత ప్రభుత్వంలో పారదర్శకంగా పింఛన్లు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అర్హతే ప్రాతిపదికగా ఏడాదికి రెండుసార్లు జనవరి, జూలైలో పార్టీలకు అతీతంగా కొత్త పింఛన్ల మంజూరు చేసేసింది. ఇందులో రాజకీయ నేతల జోక్యం లేకుండా వలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరించి, సచివాలయ సిబ్బంది ద్వారా మంజూరు చేసింది. 2019లో టీడీపీ అధికారం కోల్పోయే నాటికి జిల్లాలో 2.30 లక్షల పింఛన్లు మాత్రమే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ అధికారం నుంచి దిగిపోయే నాటికి 3.17 లక్షల పింఛన్లు ఉన్నాయి. అంటే టీడీపీ ప్రభుత్వంలో కంటే దాదాపు 87 వేల పింఛన్ల జగన్ ప్రభుత్వంలో అధికంగా ఉన్నాయి. ఈ ఐదేళ్లలో లబ్ధిదారుల్లో మృతుల సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే.. దాదాపు లక్షకు పైగా పింఛన్లు పెరిగాయని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment